అభిమానులతో ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా..!

78
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. ఈ అమ్మడు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక అది అలా ఉంటే ఇటీవల రష్మిక తన చిన్ననాటి ఫ్రెండ్ రాగిని పెళ్లికి వెళ్లారట. అక్కడ తన ఫ్రెండ్‌తో దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘రాగిని నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తన పెళ్లి సందర్భంగా పాత స్నేహితులు అందరినీ కలిశాను. ఈ రోజు తర్వాత ఆమెతో నేను ఫొటోలు దిగలేను. అందుకే మిస్‌ అవ్వాలనుకోలేదు. తెల్లవారుజామున 4గంటలకే పెళ్లికి బయలుదేరా. ఫ్లైట్‌ మిస్‌ కావడం, మరో ఫ్లైట్‌ కూడా 4, 5 సార్లు డిలే కావడంతో ఆ పెళ్లికి హాజరు కాలేనేమో అనుకున్నా. దేవుడి దయవల్ల నేను కూడా పెళ్లిలో భాగమయ్యాను.

చిన్నప్పటి నుంచి ఈ గ్యాంగ్‌తోనే పెరిగా. 17 ఏళ్ల అనుబంధం మాది. కాలం మారుతున్నా వీళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. వీళ్లంతా నా వాళ్లు అని మరోసారి నిరూపించారు. చాలాకాలం తర్వాత ఇలా వీరిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో చెప్పాలనుకుంటున్నా. రష్మిక అనే అమ్మాయి నటిగా ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు’ అని రష్మిక తెలిపింది.

- Advertisement -