నాగ చైతన్యకు నో చెప్పిన రష్మీక

226
Rashmika-Mandanna

రష్మీక మందన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు దోచేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం మూవీలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో చేస్తుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మీక మొదటి వరుసలో ఉంటుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత రష్మిక ఫేమ్ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆమె దిల్ రాజు బ్యానర్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి నో చెప్పిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అటు దిల్ రాజు బ్యానర్.. ఇటు అక్కినేని వారసుడు.. ఇంతకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకేం ఉంటుంది. కానీఈసినిమాలో నటించేందుకు రష్మీక ఒప్పుకోలేదని తెలుస్తుంది. దీనికి కారణం స్క్రీప్ట్ నచ్చకపోవడమే అని చెప్పిందట. ఇటివలే ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో ఆచితూచి స్క్రీప్ట్ ను సెలక్ట్ చేసుకుంటుందట రష్మీక.