రష్మిక మందన్నా… నిత్య కళ్యాణం పచ్చ తోరణం ! 

175
- Advertisement -

‘రష్మిక మందన్నా’ పై నెగిటివిటీ  ఆమె సొంత రాష్ట్రం అయిన  కర్ణాటకలోనే  రోజురోజుకు టన్నులకొద్దీ ఉత్పన్నమవుతుంది.  ఐతే, తన పై  విమ‌ర్శ‌ల సంగ‌తెలా ఉన్నా.. కెరీర్ లో మాత్రం రష్మిక అన్ స్టాప‌బుల్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ లో చేతి నిండా సినిమా ఆఫ‌ర్ల‌తో టాప్ లీడ్ లో కొనసాగుతుంది. కానీ, టాలీవుడ్ లో ఫుల్ ఆఫ‌ర్లు ఉన్నా..  రష్మిక మందన్నా మనసు అంతా బాలీవుడ్ మీదే ఉంది. మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు..  బాలీవుడ్ లో స్టార్ల సినిమాల్లో  పెద్దగా అవకాశాలు రాకపోయినా  రష్మిక మందన్నా మాత్రం  హిందీనే ముద్దు అంటుంది. అందుకే,  హిందీలో చిన్నాచితకా సినిమాలకు కూడా  రష్మిక  గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే కొందరు హిందీ చిన్న నిర్మాతలు రష్మిక కోసం పోటీ పడుతున్నారు.

ఎంత లేదన్నా  ‘రష్మిక మందన్నా’  సినిమాల‌కు సౌత్ లో గిరాకీ ఉంటుంది. మహేష్, బన్నీ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది.  కాబట్టి.. ఇక్కడ  రష్మిక కంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ నే వాడుకోవాలని కొందరు హిందీ నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఆ ఆశనే తను క్యాష్ చేసుకోవాలని రష్మిక మందన్నా కూడా  రికార్డు స్థాయి పారితోషికం డిమాండ్ చేస్తోంది. రష్మిక మందన్నా సౌత్ లో ఒక సినిమాకు పొందే పారితోషికం 3 కోట్ల రూపాయ‌లు. బాలీవుడ్ లో మాత్రం 4 నుంచి 5 కోట్లు అడుగుతుంది.  రష్మిక మందన్నా అడిగినంత ఇవ్వడానికి హిందీ నిర్మాతలు ముందుకు వస్తుండటమే ఇక్కడ విశేషం.

అసలు  బాలీవుడ్ లో స్టార్ డమ్ రాకుండానే రష్మిక మందన్నా ఇలా  రికార్డు స్థాయి పారితోషికం పుచ్చుకోవడం రికార్డే.  పైగా అతి తక్కువ సమయంలోనే  పాన్ ఇండియా  హీరోయిన్ గా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ గా కూడా  రష్మిక మందన్నా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి  రష్మిక మందన్నా  కెరీర్ నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా  సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి..

పిక్ టాక్ : కుర్ర సుందరాంగి… ఘాటు గ్లామరసం !

విశ్వక్ సేన్ క్లారిటీ ఇవ్వాల్సిందేగా !

ఆలస్యమెందుకు తారక్ ?

- Advertisement -