ఆలస్యమెందుకు తారక్ ?

112
jr ntr
- Advertisement -

RRR సినిమా రిలీజై చాలా నెలలవుతుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే చరణ్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య లో నటించాడు. RRR రిలీజ్ అవ్వగానే శంకర్ తో సినిమా మొదలు పెట్టేసి చకచకా షూటింగ్ చేసేస్తున్నాడు. అయితే ఎన్టీయార్ మాత్రం ఇంకా తదుపరి సినిమాను మొదలు పెట్టకుండా ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నాడు.

కొరటాల డైరెక్షన్ లో ఎన్టీయార్ తన ముప్పయవ #NTR30 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చి కూడా చాలా నెలలవుతుంది. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొరటాల తన టీమ్ తో వర్కింగ్ స్టిల్స్ వదిలి అప్ డేట్ ఇచ్చారు. కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు మాత్రం ఇంకా చాలా టైం పట్టేలా కనిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరి తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు.

నిజానికి RRR తర్వాత ఎన్టీయార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కొరటాల ఏమో ఆచార్య రిజల్ట్ తో డౌన్ అయ్యాడు. ఈ ఇద్దరికీ ఈ సినిమా విజయం కీలకం. ఎన్టీయార్ పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా ముందుకు వెళ్ళాలన్న, ఆచార్య తో డౌన్ అయిన కొరటాల కెరీర్ గ్రాఫ్ మళ్లీ పైకి లేవాలన్నా ఈ సినిమా సక్సెస్ అవ్వాల్సిందే. అందుకే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కానీ ఎన్టీయార్ ఫ్యాన్స్ మాత్రం ఆలస్యమెందుకు తారక్ అంటూ సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు. తారక్ కొత్త లుక్ తో సెట్స్ లో కనిపించే ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -