అంతకుమించి కనిపించనున్న రష్మీ..!

255
Rashmi new movie
- Advertisement -

ఎస్ జై ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం అంతకుమించి. రష్మీ, సతీష్ జై హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సతీష్. భాను ప్రకాష్ తేళ్ల, కన్నా సహ నిర్మాతలు. జానీ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ జానర్ లో అంతకుమించి తెరకెక్కుతోంది. హార్రర్ కథలో భిన్నమైన కాన్సెప్టుతో ఈ సినిమాను దర్శకుడు జానీ రూపొందిస్తున్నారు.ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో రష్మీని చూపించబోతోందీ సినిమా. ప్రస్తుతం అంతకుమించి సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ను తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి…వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సతీష్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో నటించిన అనుభవాలను రష్మీ తెలియజేస్తూ…టైటిల్ కు సరిగ్గా సరిపోయే చిత్రమిది. కథా కథనాలు అంతకుమించి ఉంటాయి. నా పాత్ర పేరు మధు ప్రియ. నా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయలేదు. నటిగా కొత్త రష్మీని చూస్తారు. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. హార్రర్ సినిమాలు అనగానే కథ ముందే ఊహిస్తారు. కానీ ఈ సినిమాలో ఓ కొత్త అంశాన్ని దర్శకుడు చూపించబోతున్నాడు. ఆ పాయింట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మంచి నిర్మాణ విలువలతో అంతకుమించి రూపొందుతోంది. ప్రతిభ గల సాంకేతిక నిపుణులు సినిమాకు ప్రధాన బలం అని భావిస్తున్నాను. నానుంచి ప్రేక్షకుల ఆశించే అన్ని అంశాలుంటాయి. అని చెప్పారు.

unnamed (1)

హీరో సతీష్ జై మాట్లాడుతూ…ఈ చిత్రంలో మధ్య తరగతి యువకుడి పాత్రలో నటిస్తున్నాను. మన చుట్టుపక్కల చూసే ఓ సాదా సీదా కుర్రాడిగా కనిపిస్తాను. అతనికి పెద్దగా బాధ్యతలు ఏవీ ఉండవు. సహజంగా నటించే అవకాశమున్న పాత్ర. రష్మీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె పాత్రకు తగ్గకుండా నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. రష్మి సహకారం మర్చిపోలేను. అందరం కథపై నమ్మకంతో ఉన్నాం. దర్శకుడు జానీ కథను మరింత బాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ చేస్తున్నాం. 70 శాతం షూటింగ్ పూర్తయింది. మరో 30 శాతం మిగిలి ఉంది. రెండు పాటల చిత్రీకరణ కోసం త్వరలో గోవా వెళ్తున్నాం. ఈ నెలాఖరుకు మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో ఫస్ట్ లుక్, ఆడియో కార్యక్రమాలు జరుపుతాం. వచ్చే నెలలో సినిమా మీ ముందుకు వస్తుంది. అన్నారు.

unnamed

దర్శకుడు జానీ మాట్లాడుతూ..దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు అంతకుమించి ఉన్నాయనిపించేలా సినిమా వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చివరి షెడ్యూల్ రూపొందిస్తున్నాం. రష్మీ క్రేజ్ ఒక్కటే కాదు..ఆమెను నటిగా ఆవిష్కరించే సినిమా అవుతుంది. గతంలో హార్రర్ తరహా కథలు చాలా చూశాం. మేం ఈ జానర్ లోనే కొత్త కాన్సెప్టుతో సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు సహా అందరి పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మంచి సాంకేతిక నిపుణుల సహాయంతో అనుకున్న సమయానికి అనుకున్నట్లు చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సతీష్ జై, హీరోయిన్ రష్మీలకు గుర్తుండిపోయే చిత్రమవుతుందని నమ్ముతున్నాం. అన్నారు

సూర్య, మధు నందన్, రవి ప్రకాష్, అజయ్ ఘోష్, వంశీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాల్ రెడ్డి, స్టంట్స్ రామ్ సుంకర, సంగీతం సునీల్ కశ్యప్, మాటలు మోహన్ చందా, సహ నిర్మాతలు భాను ప్రకాష్ తేళ్ల, కన్నా, నిర్మాత సతీష్, కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం జానీ

- Advertisement -