థర్డ్ వేవ్…మాస్క్ ధరించండి: రాశీ

76
rashi

కరోనా సెకెండ్ వేవ్ భయాలను మర్చిపోక ముందే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇక థర్డ్ వేవ్ వార్తలతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు నటీనటులు ముందుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా తనవంతుగా ప్రజలకు అవేర్ నెస్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న మాస్క్ ధరించడం మరిచిపొవద్దని తాను మాస్క్ ధరించిన ఫోటోను షేర్ చేశారు.

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్‌లలో నటిస్తు ముందుకుసాగుతోంది. కోలీవుడ్‌లో రాశీ నటించిన ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాల షూటింగ్స్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా కార్తీ సరసన ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తుండగా హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (వర్కింగ్‌ టైటిల్‌), అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉంది.