భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌.. నెం.1 అనౌన్స్‌మెంట్‌

99
bp 1

భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌.. టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌ను భారీ స్థాయిలో నిర్మించ‌డానికి అడుగుపెట్టిన నిర్మాణ సంస్థ‌. ఈ నిర్మాణ సంస్థ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను రూపొందించ‌నుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్న ప్రొడ‌క్ష‌న్ నెం.1ను అనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

శ్రీనివాస్ రాజు అంద‌రికీ న‌చ్చేలా వైవిధ్యమైన క‌థాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. 100% ల‌వ్ సినిమా కెమెరామెన్ వెంక‌ట్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బి.హెచ్ ఎడిట‌ర్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో పనిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియజేయనున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ రాజు
బ్యాన‌ర్‌: భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ప్ర‌సాద్‌(100%ల‌వ్‌)
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌