విజయ్ అలా అనడంతో హర్ట్ అయ్యాను- రాశీ ఖన్నా

591
Raashi Khanna
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్నారు. ఇందులో విజయ్‌ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకలో రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “ఇప్పుడు నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమూ, ప్రేమొలో లేనివాళ్ల కోసమూ కూడా. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. కథల్లో, సినిమాల్లో, పద్యాల్లో ఈ ఎమోషన్ గురించి వర్ణించారు. ఎన్నిసార్లు వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. మన తరానికి చాలా ఇష్టం. ఈ సినిమా మిమ్మల్ని అసంతృప్తికి గురిచెయ్యదు. గౌతమ్‌తో, యామినితో రిలేట్ అవుతారు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను.

vijay devarakondaఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. అతన్ని లవ్ స్టోరీల్లో చూడ్డం నాకిష్టం. అతను లవర్ పోస్టర్ బాయ్. తన ఫ్యాన్స్ ను అతను హర్ట్ చేశాడు. నాకు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను. విజయ్ ను ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూస్తారు. ఈ తరానికి అతను ఇన్స్పిరేషన్. అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా. క్రాంతిమాధవ్ మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు. కేఎస్ రామారావు మమ్మల్ని అందరినీ తన కుటుంబంలా చూసుకున్నారు” అని చెప్పారు.

- Advertisement -