గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న విశాఖపట్నం కమీషనర్..

621
green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గ్రేటర్ విశాఖపట్నం కమీషనరు సృజన సోమవారం గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో జారీపేటలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

Commissioner G Srijana

ఈ సందర్భంగా కమీషనర్ సృజన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కూమార్‌కి అభినందనలు తెలుపుతున్నాను అని. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ఉన్న 147 ప్రభుత్వ పాఠశాలలో ఆవరణంలో కూడ మొక్కలు నాటాలని అధికారుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు,విద్యార్థులు పాల్గొన్నారు.

 

GVMC Commissioner