ఆస్కార్ బరిలో న్యూటన్…

196
Raos Newton for Oscars
- Advertisement -

ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో రాజ్‌కుమార్ రావు నటించిన ఇండియ‌న్ మూవీ న్యూటన్ ఉత్తమ విదేశీ చిత్రం కేట‌గిరిలో సెల‌క్ట్ అయింది. ఈ మేరకు ఆస్కార్‌కు భారత ఎంట్రీని పంపడానికి నియమించిన కమిటీ అఫిషియల్‌గా అనౌన్స్‌ మెంట్ చేసింద.

భార‌త్ నుండి దాదాపు 26 సినిమాలు రేసులో నిలవ‌గా, చివ‌రికి ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా న్యూట‌న్‌ని ఎంపిక చేసింది. అయితే ప్ర‌స్తుతం ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటికి హెడ్‌గా ఉన్న తెలుగు నిర్మాత సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఎంపిక చేయ‌డం విశేషం. ఈ ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వర్షం కురిపించిన బాహుబ‌లి2 , దంగ‌ల్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు న్యూటన్ ముందు తేలిపోయాయి.

న్యూటన్ చిత్రం బ్లాక్ కామెడీ తరహా సినిమాగా రూపొందగా, చత్తీస్ ఘడ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ఆఫీస‌ర్‌ కథే ఈ సినిమా. ఈ చిత్రంలో ఎన్నికలు స‌జావుగా జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటే , వారిని న్యూట‌న్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. ఈ చిత్రంలో రాజ‌కీయ‌ప‌ర‌మైన కామెంట్లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తుంది. మావోయిస్టులు దాడి చేస్తార‌ని తెలిసినా… ఎన్నిక‌ల‌ను నిష్పాక్షికంగా నిర్వ‌హించాల‌న్న ల‌క్ష్యంతో రాజ్ కుమార్ రావు పాత్ర చేసే ప్ర‌య‌త్న‌మే న్యూట‌న్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకి మ‌నీష్ ముంద్ర క‌థ‌ని అందించారు. పంక‌జ్ త్రిపాఠి, అంజ‌లి పాటిల్‌, ర‌ఘువీర్ యాద‌వ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మించింది.

- Advertisement -