‘స్పైడర్’కి సవాల్‌గా ‘జై లవ కుశ’‌…

250
- Advertisement -

‘జై లవకుశ’ ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్‌టాపిక్‌. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ కలయికలో రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 32 కోట్ల షేర్ ను 45 కోట్ల గ్రాస్ ను సాధించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్కెట్ పెరిగిపోయిందనే విషయాన్ని ఈ సినిమా స్పష్టం చేస్తోంది.

Jr NTR Jai Lava Kusa Vs Mahesh Babu Spyder

ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడంతో ఆ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘స్పైడర్’కి సవాల్‌గా మారనుందని సమాచారం.మరి ‘జై లవ కుశ’కి హిట్ టాక్ వచ్చిన కారణంగా ‘స్పైడర్’ వచ్చేటప్పటికీ చాలా థియేటర్స్ లో ఇంకా ఆ సినిమా ఉంటుంది. ఇక ‘మహానుభావుడు’ కోసం మరికొన్ని థియేటర్లు రెడీగా వున్నాయి. కనుక అత్యధిక థియేటర్స్ లో ‘స్పైడర్’ రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు కనుక, ఓపెనింగ్స్ పరంగా ‘జై లవ కుశ’ను బీట్ చేసే ఛాన్స్ కూడా తక్కువేనని అంటున్నారు. ‘జై లవకుశ’ను ఢీ కొట్టాలంటే ‘స్పైడర్’ లో బలమైన కంటెంట్ ఉండాల్సిందేననేది సుస్పష్టం.

- Advertisement -