బాలీవుడ్లోనే హాలీవుడ్లో సైతం తనఅందచందాలతో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న బ్యూటీ దీపికా పదుకొనే. ప్రస్తుతం దీపికా నటించిన పద్మావత్ అనేక వివాదాల అనంతరం ప్రేక్షకుల ముందుకురాగా హిట్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దీపికా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సినిమాల్లో రణవీర్ సింగ్ బెస్ట్ కిస్సర్ అంటూ కితాబిచ్చేసింది. ఇక ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. గతంలో దీపికా పదుకోన్ అద్భుతంగా ముద్దు పెడుతుంది అని రణ్వీర్ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రామ్‌లీలా చిత్రంలోని అంగ్ లాగా దే పాట చిత్రీకరణ సందర్భంగా దీపిక పెట్టిన ముద్దులు మరిచిపోలేను చెప్పడం గమనార్హం.
రామ్‌లీలా సినిమా షూటింగ్లో దీపికా పదుకోన్, రణ్వీర్ ప్రేమలో పడగా వీరిద్దరు శ్రీలంకలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే దీపికా ఈ వార్తలను కొట్టిపారేయడంతో ఆ పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లైంది.