రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ మంత్రి

385
Trs Flag
- Advertisement -

స్ధానిక సంస్ధల ఎన్నికలు పూర్తీ కాగానే ఎమ్మెల్సీలు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే నోటికేషన్ విడుదల కాగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్ధులు మే 14వ తేది లోపు నామినేషన్ వేయాలి. మే 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 31వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. రంగారెడ్డి జిల్లా నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి కొండగల్ ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఆ పదవికి రాజీనామా చేశారు.

ఈఉప ఎనికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 2 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తారు.

ఈ ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపీకపై పార్టీ అధినేత కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో నాయకులతో చర్చించి అభ్యర్ధిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -