మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీలకు మంత్రి కేటీఆర్‌ అభినందలు..

15
ktr

మహబూబ్‌ నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ చెందిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు వారిని ఎమ్మెల్సీలుగా అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అనతరం నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. వారి వెంట క్రీడల శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నారు.