కాంగ్రెస్ కూటమి నుంచి చంద్రబాబును పంపిస్తేనే మేలు

244
Congres Alince
- Advertisement -

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఏపీలో అధికారంలోకి రావడం కష్టమే అని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ఇక చంద్రబాబు పని అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు.. ఇక చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఒక వేళ మే23 తర్వాత వచ్చే ఫలితాల్లో చంద్రబాబు కనుక అధికారంలోకి రాకపోతే ఆయన్ను కాంగ్రెస్ కూటమి నుంచి దూరంగా పెట్టడం మేలు అని చెబుతున్నారు పరిశీలకులు.

తెలంగాణలో అసలు టీడీపీ పార్టీయే లేదు. ఒక వేళ ఆంధ్రాలో ఆయనకు తక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ అదిష్టానం పెద్దగా పట్టించుకోకపోవచ్చని చెప్పుకోవచ్చు.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లను సాధించే అవకాశాలున్నాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. అవి ఎంతో కొంత మేర నిజం అయినా చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే ఎంపీ సీట్లు చాలా తక్కువే అవుతాయి.

తెలంగాణలో తాము 16 స్ధానాల్లో గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఏపీలో 10 నుంచి 15 ఎంపీ స్ధానాల్లో వైఎస్ ఆర్సీపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం మీద కేసీఆర్ జగన్ చేతిలో 35 ఎంపీ సీట్లు ఉంటాయి. అప్పుడు కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోతే కేసీఆర్, జగన్ లు కింగ్ మేకర్ లు కావచ్చు.. అప్పుడు చంద్రబాబుతో కాంగ్రెస్ పెద్దగా పని కూడా ఉండకపోవచ్చు.. తాజాగా ఉన్న పరిస్ధితులను చూస్తుంటే కాంగ్రెస్ అధిస్టానం చంద్రబాబును పక్కన పెట్టి కేసీఆర్, జగన్ లను తమ కూటమిలో చేర్చుకుంటే మేలు అని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -