రానా..రాక్షసరాజ్యంలో రావణాసురుడు..!

278
rana

వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు రానా. ప్రస్తుతం రానా చేతిలో అరడజనుకిపైగా సినిమాలు ఉండగా తాజాగా మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన రానా మరో సినిమాకు కమిట్ అయినట్లు టీ టౌన్ వర్గాల సమాచారం.

నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టడమే కాదు రీ ఎంట్రీతో మంచి మార్కులు కొట్టేశాడు తేజ. ఈ నేపథ్యంలో రానాతో మరోసారి సినిమా చేస్తున్న తేజ ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించే ఈ మూవీకి రాక్షస రాజ్యంలో రావణాసురుడు అనే పేరు పెట్టాలని తేజ భావిస్తున్నాడట. అయితే రానా -తేజ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.