సైంటిస్ట్‌గా మారనున్న రానా..

179
- Advertisement -

‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా హాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్నారు. ఆయన నటించబోయే తొలి హాలీవుడ్‌ చిత్రాన్ని భారతదేశంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. బాహుబలితో దగ్గుబాటి రానా రేంజ్ అమాంతం మారిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సోలో హీరోగా సక్సెస్ సాధించేశాడు. ఇప్పుడు తన కెరీర్ ను మరింత ఉన్నత స్థాయిలకు తీసుకు వెళ్లేందుకు రానా రెడీ అయిపోయాడు.

Rana Daggubati's Hollywood debut

విజిల్- ది మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనే టైటిల్ పై రూపొందనున్న హాలీవుడ్ చిత్రం.. ఇండియా బేస్డ్ గానే సాగుతుంది. ధ్వనిల్ మెహతా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్ర కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. 1888 నవంబర్ 8న మధ్య భారత్ ప్రాంతంలోని సౌరాష్ట్ర సమీపంలో మునిగిపోయి అంతర్ధానం అయిపోయిన విజిల్ అనే షిప్ కు సంబంధించిన కథే ఈ సినిమా. 700 ప్రయాణికులు ఉండగా.. తుఫాన్ కారణంగా ఈ జెయింట్ షిప్ సముద్రంలో మాయమైపోతుంది. ఈ షిప్ సస్పెన్స్ గుట్టు విప్పే సైంటిస్ట్ పాత్రలో రానా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

తుఫాన్ ప్రభావంతో ఓడ మునిగిపోయినా.. దీనికి సంబంధించిన సస్పెన్స్ మాత్రం కొనసాగడమే.. ఈ మూవీ మెయిన్ థీమ్. ఆ పాయింట్ విపరీతంగా నచ్చడంతోనే.. ఈ సినిమాకు యాక్సెప్ట్ చేశాడట రానా. రీసెంట్ గా లండన్ లో స్టోరీ డిస్కషన్స్ దాదాపుగా పూర్తవగా.. ప్రస్తుతం లొకేషన్ ఎంపికలో విజిల్ టీం నిమగ్నమై ఉంది. షిప్ అంతర్ధానం పై పరిశోధనలు చేసే పవర్ ఫుల్ శాస్త్తవేత్త రోల్ తో హాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వానన్నాడు రానా.

- Advertisement -