రానాతో అఖిల్‌ మూవీ..?

212

‘అఖిల్‌’ సినిమా చేదు అనుభవం నుంచి బయటపడి ‘హలో’ సినిమాతో ఫర్వాలేదని అనిపించుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో అఖిల్ లోని టాలెంట్ ఏమిటో ఇండస్ట్రీకి.. ప్రేక్షకులకు తెలియజేసింది. హలో తరవాత ఏం చేయాలా అన్నదానిపై కొద్దిరోజులుగా కుస్తీలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Rana Daggubati To Produce An Akkineni Film?

అఖిల్ మూడవ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారిన ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘రంగస్థలం’ పూర్తి చేసిన సుకుమార్‌తో అఖిల్ సినిమా వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.అఖిల్ నాల్గొవ సినిమా చేయడానికి తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.

ఆయన ప్రయత్నాలు కొంతవరకూ ఫలించాయని కూడా అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలకు రానా నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గురించే తండ్రి సురేశ్ బాబుతో రానా చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. ఆల్రెడీ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రానా ఒక సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.