రానాను లైన్‌లో పెడుతున్న చరణ్‌..

178
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తా చాటి తనలో ఉన్న జోరు ఇంకా తగ్గలేదని నిరూపించారు చిరు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు ఇప్పుడు వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే 151వ సినిమా సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర‌గా ఈ సినిమా తెర‌కెక్కనుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
 Rana Daggubati in Chiranjeevi's 151 movie
అయితే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు  రామ్‌చరణ్ తేజ్‌ రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించడమే కాకుండా నటీనటుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. అందులో భాగంగానే ‘బాహుబలి’ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, చిన్ననాటి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటిని ఈ ప్రాజెక్టులో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
Rana Daggubati in Chiranjeevi's 151 movie
ఈ పాత్రను రానా చేస్తేనే బాగుంటుందని భావించిన చరణ్, రానాని సంప్రదించడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇప్పటివరకూ ‘బాహుబలి 2’ సినిమా ప్రమోషన్స్ లో రానా బిజీగా ఉండటం వలన, చరణ్ రానా దగ్గర ఈ విషయాన్ని గురించి ప్రస్తావించలేదట. ఈ సినిమా కోసం రానాను తీసుకుంటే తప్పకుండా రానా ప్రత్యేక ఆకర్షణ అవుతాడనీ, చరణ్ అడిగితే రానా కాదనడమంటూ జరగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -