- Advertisement -
సినీ నటుడు బెనర్జీ తండ్రి, నటుడు రాఘవయ్య ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…నిన్న(ఆదివారం) రోజున తన నివాసంలో చనిపోయారు. రాఘవయ్య భౌతిక దేహాన్ని ఫిల్మ్ నగర్‌లోని ఇంటి దగ్గర సందర్శన నిమిత్తం ఉంచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే ఆయన మృతిపట్ల టాలీవుడ్ దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది. తాజాగా ప్రముఖ హీరో చిరంజీవి సోమవారం ఉదయం బెనర్జీ ని స్వయంగా ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. రాఘవయ్య మృతిపట్ల చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
- Advertisement -

