డిసెంబరు 1 నుంచి 4 వరకు ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి.రామ్మోహన్‌రావు తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం(రేపు) సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నంథనమ్, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరవుతారని వెల్లడించారు.
ఇండీవుడ్ కార్నివాల్ 2017లో ఇండియన్ బిలియనీర్స్ క్లబ్ ప్రారంభోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇండీవుడ్ కన్సార్షియం డైరెక్టర్ సతీష్‌చంద్రన్ అన్నారు. 130 సినిమాలను ఎంపిక చేసి ప్రదర్శించే అవకాశం ఉంది. ఆరు కేటగిరీల్లో ఈ సినిమాలు పోటీ పడాల్సి ఉంటుంది. పోటీలకు న్యాయ నిర్ణేతగా శ్యామ్‌బెనగల్ వ్యవహరిస్తారని వెల్లడించారు.
ప్రపంచదేశాలకు చెందిన 50 వేల మంది హాజరుకానున్నట్టు ఇండీవుడ్ ఫౌండర్ డైరెక్టర్ సోహన్ రాయ్ తెలిపారు. 5 వేల మంది వ్యాపార ప్రతినిధులు, 500పైగా పెట్టుబడిదారులు, 300 మంది ప్రదర్శన కారులు, దేశవ్యాప్తంగా 2500 మందికి పైగా తమ ప్రతిభను చాటేందుకు హాజరుకానున్నారు.