చిరంజీవి మూవీలో గెస్ట్ గా రామ్ చరణ్

311
Chiranjeevi Ram Charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు. ఈసినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ చిరంజీవి 150 సినిమా నుంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ అటు ఆర్ఆర్ఆరా్ లో నటిస్తూనే సైరా నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.

చిరంజీవి రామ్ చరణ్‌ కలిసి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు. రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మగధీర, బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి గెస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఖైదీ నెంబర్ 150సినిమాలో రామ్ చరణ్ చిరంజీవి కలిసి ఇద్దరు ఒక పాటకు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

సైరా మూవీ తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈమూవీలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ఇందులో చెర్రీ కోసం ప్ర‌త్యేక పాత్ర సిద్దం చేశాడ‌ట కొర‌టాల‌. ఆ పాత్ర‌లో న‌టించేందుకు చర‌ణ్ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -