అక్కినేని అన్నదమ్ముల మల్టీస్టారర్

250
Akhil Nagachaitanya.jpeg

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు తెలస్తుంది. ఇప్పుడి వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా తీసునున్నట్లు సమచారం. ఈసినిమాకు మన్మధుడు2 దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రాహుల్ కథను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తుంది.

రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం నాగార్జునతో మన్మధుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ఆగస్ట్ 8న విడుదల కానుంది. నాగచైతన్య , అఖిల్ కూడా ప్రస్తుతం బిజీగా ఉండటంతో మరొకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఇక మన్మధుడు 2 తర్వాత నాగార్జున కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాలో నటించనున్నారు. ఈసినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఈచిత్రం పైర్తైన తర్వాత రాహుల్ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా రానుందని సమాచారం.