కామెంట్లు, లైకులు కొట్టేముందు ఆలోచించండి… లేకుంటే…

255
- Advertisement -

ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఇతర మతాలను, వ్యక్తులను ఉద్దేశించి కించపరిచే పోస్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రామంగుండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తిని గాని, మతాన్ని గాన్ని కించ పరుస్తూ పోస్టింగులు, కామెంట్లు చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కించపరిచేలా పోస్టులు చేసిన వారితో పాటు ఆ పోస్టులకు లైకులు కొట్టిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై సెక్షన్ 153ఎ, 295ఎ, ఐపీసీ 66సీ, ఐటీ యాక్టు కింద అరెస్టు, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Ramagundam police warnings whatsapp facebook likes and comments

నాకు తెలియకుండా మా ఫ్రెండ్ పోస్టు చేశాడు, షేర్ చేశాడు అనే అవకాశం లేకుండా బాధితులుగానే చూస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే గాయపరిచే పోస్టులైనా నిలిచిపోతాయని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు, కామెంట్లు చేస్తున్న వారందరూ ఈ హెచ్చరికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

తాజాగా పోలీసులు తీసుకున్న నిర్ణయం వల్ల రాజకీయ నాయకులకు ఊరట కల్గిస్తుంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్లు పోస్టులు చేస్తుండడంతో వారితో వాగ్వాదానికి దిగుతున్నారు కొందరు రాజకీయనాయకులు. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ఈ నిర్ణయం వల్ల వీటన్నింటికి చెక్ పడనుంది.

- Advertisement -