Ram Mandir:22నే ఎందుకు?

22
- Advertisement -

శ్రీరామ జన్మస్థలమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశ, విదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరుకానుండగా ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. హిందూ పురాణాల ప్రకారం.. అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనం అవుతాయి. ఈ కాలం ప్రాణ ప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు అనువుగా ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం … దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:59కి ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందున హిందువులకు ఇది శుభ సమయం. అందుకే 22నే రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. 2024 జనవరి 22న, మృగశీర్ష నక్షత్రం ఉదయం 03:52 గంటలకు ప్రారంభమై 2024 జనవరి 23న ఉదయం 07:13 వరకు కొనసాగుతుంది.
Also Read:హను-మాన్‌కు రెస్పాన్స్ అదుర్స్‌: అమృత అయ్యర్

- Advertisement -