శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ

675
varma
- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. శంషాబాద్ ఏసీపీ తో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచారంపై వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిశ హత్యకు సంబంధించిన పలు వివరాలను సేకరిస్తున్నాడు వర్మ. కొద్ది రోజుల క్రితం దిశ హత్య కేసు నిందితుడు చెన్నకేశవులు భార్యను ఇంటర్వూ చేశాడు.

varma

చెన్నకేశవులు గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు వర్మ. తాజాగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరిన్ని వివరాలను సేకరిస్తున్నాడు. దిశ హత్యకు సంబంధించిన పలు విషయాలు, నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన అంశాలను వర్మ కు వివరించారు పోలీసు అధికారులు. ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్ కౌంటర్ జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు.

- Advertisement -