కంది రైతులు ఆందోళన చెందవద్దు: నిరంజన్‌ రెడ్డి

332
singireddy niranjanreddy
- Advertisement -

కంది రైతులు ఆందోళన చెందవద్దని…రాష్ట్ర ప్రభుత్వమే మద్దతుధరకు కందులు కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కంది రైతుల సమస్యను తెలపగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో అభయం ఇచ్చారని తెలిపారు.

కంది కొనుగోళ్లకు దాదాపు రూ..200 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతుందని…కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17ను రైతులకు పర్వదినంగా భావిస్తాం అన్నారు. దేశం చూపు తెలంగాణ రైతుల వైపు, తెలంగాణ వ్యవసాయం వైపు ఉందని..కేసీఆర్ చిత్తశుధ్దితో తీసుకున్న నిర్ణయాల అమలే దీనికి కారణం అన్నారు.

రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ ఆనందంగా ఉన్నారని…కృష్ణ, గోదావరి జలాలను భీళ్లకు మలిపి రైతాంగానికి సాగునీరు అందించారని చెప్పారు. తెలంగాణ రాకతో తెలంగాణ రైతాంగానికి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. రైతు సానుకూల విధానాలు, నిర్ణయాలతో వ్యవసాయరంగంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సంధర్భంగా రైతులు రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు.

ఒక కోటీ 22 లక్షల ఎకరాలలో ఖరీఫ్ లో అద్భుతమయిన పంటలు పండాయని…తెలంగాణ నేల మీద, తెలంగాణ పల్లెల్లో లక్ష్మి కళకళలాడుతుందన్నారు. పత్తి, వరి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతుధరకు కొనుగోలుచేస్తుందన్నారు. ఖరీఫ్ లో 41 లక్షల ఎకరాలలో వరి, 5 లక్షల ఎకరాలలో కంది సాగయిందని..కందిని మద్దతుధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం మద్దతు కోరడం జరిగిందన్నారు.

రూ.5800 క్వింటాలు చొప్పున 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని..2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని రోజూ కేంద్రం ప్రగల్భాలు చెబుతుందన్నారు. విదేశీ మారకద్రవ్యం పెంచుకునే పసుపుపంటకు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని..తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం అభ్యంతరకరం అన్నారు.

కేంద్రం కొత్త నిధులు ఏమీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదని .. రాష్ట్రాలకు రావాల్సిన నిధులే ఇవ్వడం లేదు..కేంద్రం కేవలం పంపిణీదారు మాత్రమే .. హక్కు దారు కాదన్నారు. రైతు సానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న తెలంగాణకు మాత్రం సహకరించడం లేదన్నారు. కంది కొనుగోలు కోటాను పెంచాలని లేఖ రాసినా కేంద్రం స్పందించలేదని…కంది దిగుబడిపై వ్యవసాయ శాఖ వద్ద సమగ్ర సమాచారం ఉందన్నారు. దళారులు అక్రమంగా తెచ్చి అమ్ముతే కఠినచర్యలు … అధికారులు సహకరిస్తే జైలుకు పంపిస్తాం…సరిహద్దు రాష్ట్రాల వద్ద నిఘా పెంచండి .. ఇతర రాష్ట్రాల కందులు మన మార్కెట్లకు రావొద్దు అన్నారు.

దేశ చరిత్రలో అత్యధికంగా ఉపాధిరంగం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సహకార ఎన్నికల్లో స్ఫూర్థిదాయక తీర్పునిచ్చిన తెలంగాణ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని…ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికార యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి , మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి , పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -