సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలను మొత్తం ఈచిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు వర్మ. ప్రస్తుత ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలను కూడా విడుదల చేశారు దర్శకుడు వర్మ. వెన్నుపోటు అనే పాట సంచలనం రేపిన విషయం తెలిసిందే .
వెన్నుపొటు పాట చూస్తే మాత్రం చంద్రబాబు టార్గెట్ గా వర్మ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈచిత్రానికి వైసిపి నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రం గురించి స్పందిస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈమూవీ టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు.