మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ వినయ విధేయ రామ. ప్రస్తుతం ఒక రెండు పాటల చిత్రకరణ తప్ప మిగతా పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈమూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
‘తందానే తందానే..’ పాటకు మంచి స్పందన లభించింది.తాజాగా మరో సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. చరణ్, కియారా మధ్య సాగే ‘తస్సాదియ్యా..’ డ్యుయెట్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘రోమియో, జూలియట్ మళ్లీ పుట్టినట్లు ఉంటాదంట మన జట్టు, వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్‌గా రాసినట్లు మన లవ్ స్టోరీ హిట్టు..’ అని సాగే ఈ పాట ఆకట్టుకుంటోది.బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈమూవీని విడుదల చేయనున్నారు.