ఆగ‌స్ట్ 15న ‘సాహో’ విడుద‌ల‌..

81
sahoo

బాహుబ‌లి త‌ర్వాత రెబ‌ల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న సినిమా సాహో. సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈమూవీలో బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్దా క‌పూర్ హీరోయిన్గా న‌టిస్తోంది. భారీ యాక్ష‌న్ నేప‌థ్యంలో ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీ ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్ర‌భాస్ అభిమానులు. ఈమూవీ విడుద‌లపై తాజాగా సోష‌ల్ మీడియాలో ప‌లు ప్ర‌చారాలు వ‌స్తున్నాయి. ఈమూవీని ఆగ‌స్ట్ 15వ తేదిన విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

prabhas sahoo

బాహుబ‌లి మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ కు ప్రపంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అందుకే ఈమూవీనికి అదే రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ వుండనున్నాయి. నీల్ నితిన్ ముఖేష్ .. అరుణ్ విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.