వైజాగ్ బీచ్ రోడ్ లో రామ్ చరణ్ స్టూడియో..!

190
Ram CHaran Set up Film Studio in vizag..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం ” సైరా” సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వస్తున్న కొన్ని వార్తల ప్రకారం రామ్ చరణ్ సొంతంగా ఓ ఫిల్మ్ స్టూడియో కట్టడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడవుతుంది. అయితే రామ్ చరణ్ ఇంతవరకు ఈ విషయం ఫై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ వైజాగ్ బీచ్ రోడ్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించబోతున్నట్టు వచ్చిన వార్త అంతర్జాలంలో సంచలనం సృష్టిస్తోంది.

Ram CHaran Set up Film Studio in vizag..!

తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సినీరంగ పరిశ్రమ లేకపోవడంతో,ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీరంగ పరిశ్రమల నిర్మాణాలకు రాయితీలను ఇస్తామని హామీ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ప్రముఖుడైన ఘంటా శ్రీనివాసరావు గారు కూడా రామ్ చరణ్ కు కొంత ప్రోత్సాహకంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ కి సన్నిహితుడైన ఆయన చిరు ఫ్యామిలీ ఫంక్షన్ ల సమయం లో ముఖ్య అతిధిగా హాజరైనప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో సినీరంగ పరిశ్రమ గురించి మాట్లాడిన సంగతి మనకి తెలిసిందే.

Ram CHaran Set up Film Studio in vizag..!

ఇప్పుడు రామ్ చరణ్ సారధ్యం లో గంటా శ్రీనివాసరావు గారి ప్రోత్సాహకం తో వైజాగ్ బీచ్ రోడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ రాబోతున్నట్టు వస్తున్న వార్తలు విశ్లేషకులకు చర్చనీయాంశమయ్యాయి.ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే, రామ్ చరణ్ దగ్గరనుంచి గాని, మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి గాని అధికార ప్రకటన వచ్చేంత వరకు ఎదురుచూడాల్సిందే.