రంగస్థలం..సక్కగున్నావే సాంగ్‌తో సిట్టిబాబు

195
- Advertisement -

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎంతసక్కగున్నావే.. సాంగ్‌ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్,రామ్ చరణ్,సమంత ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకోగా ఈ సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Ram Charan Rangasthalam songs for valentines day

టీజర్‌లో చరణ్‌ పలికే డైలాగ్స్‌ కొత్తగా అనిపించాయి. నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటారు చెప్పుకొచ్చాడు చెర్రీ. గత సినిమాలకంటే భిన్నంగా కనిపించారు. ఆయన డైలాగ్‌ డెలివరీ కూడా కొత్తగా అనిపించింది. గోదావరి యాసలో చరణ్‌ డైలాగ్‌లు పలికారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -