రామ్‌ చరణ్‌ని ఇంప్రెస్‌ చేసిన ‘ఉప్పెన’

188
uppena
- Advertisement -

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న ‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

హీరో వైష్ణ‌వ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బుధ‌వారం టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్రేక్ష‌కుల‌ నుండి టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా రామ్ చరణ్ కూడా ఈ సినిమా టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉప్పెన టీజర్ చాలా అందంగా ఉందని, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ఫెయిర్ చాలా ఫ్రెష్ గా ఉందంటూ.. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, ఇప్ప‌టికే విడుద‌లైన‌ ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’, ‘ధ‌క్ ధ‌క్‌’, ‘రంగుల‌ద్దుకున్న’ పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బాగా అల‌రిస్తున్నాయి. త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు.

- Advertisement -