సినిమాల్లో ఒకప్పుడు డాన్సులు పెద్దగా ఉండేవి కావు. కానీ ఇప్పుడొస్తున్న అన్నిసినిమాల్లో డాన్స్ కి ప్రత్యేకమైన స్థానం కల్పించబడుతోంది. హీరో హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేదానిపై ప్రేక్షకులు ఓ లుక్కేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు నేటితరం హీరోలయితే డాన్సులతో ఇరగదీస్తున్నారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఈ ముగ్గురు యంగ్ హీరోలు తమ డాన్సులతో చూసేవారి మతిపోగొట్టేస్తున్నారు.
అయితే ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే.. అయితే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం చరణ్ , అల్లు అర్జున్ ల కంటే ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని అంటోంది. చరణ్ , అల్లు అర్జున్ లు కూడా బ్రహ్మాండమైన డ్యాన్సర్ లు అందులో సందేహం లేదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా బ్రహ్మాండమైన డ్యాన్సర్ అని కితాబునిచ్చింది ఈ భామ.
‘తారక్‌తో డాన్స్ చేయడం చాలా కష్టం. అతనికి కొరియోగ్రాఫర్ ఏ స్టెప్ చెప్పినా అలా చూసేసి టేక్‌కి వెళ్లిపోదాం అంటాడు. అసలు రిహార్సల్ చేయడు. తనతో చేస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే తనకంటే ముందు ఆ స్టెప్స్ నాకు నేర్పించమని అడుగుతా’ అని రకుల్ వివరించింది. అదే అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే రిహార్సల్స్ చేస్తారని, వారితో ఒక్క రోజు రిహార్సల్ చేసిన తర్వాత టేక్‌కి వెళుతుంటానని, కానీ తారక్‌తో అలా వుండదని, అతను చూసి స్టెప్ ఏంటనేది పట్టేస్తాడని చెప్పింది. ఆమె ఇచ్చిన ఈ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.