రాజ్యసభ…రజనీ అశోక్‌రావు సస్పెండ్‌

22
- Advertisement -

రాజ్యసభలో సభా కార్యక్రమాలను రికార్డు చేసినందుకు మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ రజనీ అశోక్‌రావ్‌ పాటిల్‌ను సస్పెండ్ చేశారు. గురువారం జరిగిన సభా కార్యక్రమాలను రికార్డు చేసినందుకు ఈ చర్య తీసుకున్నామని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌్ ధన్కర్‌ అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీతో దర్యాప్తు చేయిస్తామని అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం సమయంలో విపక్షాలు ఆందోళనలు చేశారు. ఈ సమయంలో ఎంపీ రజనీ అశోక్‌రావు పాటిల్ వీడియోలు తీసి ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేయడం వల్ల రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ స్పందించారు. మిగతా బడ్జెట్‌ సమావేశాల వరకు ఆమెను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

తేజస్వికి లేఖ రాసిన పింకీ…

రాజస్థాన్‌ సభలో రచ్చ రచ్చ…

లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

- Advertisement -