బిచ్చగాడు2..స్నీక్ పీక్ వీడియో

16
- Advertisement -

2016లో తమిళంలో పిచ్చైకారన్‌(బిచ్చగాడు) విడుదలై సంచలనం సృష్టించింది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా విజయ్‌ సీక్వెల్‌ త్వరలో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాల మధ్య బిచ్చగాడు2 స్నీక్ పీక్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మొదటి నాలుగు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. దీనికి మనీ ఈజ్ ఇంజ్యూరియస్‌ టు ది వరల్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను రూపొందించింది చిత్రయూనిట్.

విజయ్‌ ఆంటోని సరికొత్త అంశాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా స్నీక్ పీక్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అన్నట్టు బిచ్చగాడు-2 షూటింగ్ సమయంలో విజయ్‌ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఫుల్ మూన్‌ మీడియాలో వీజే సన్నీ…

శివరాజ్‌కుమార్‌ మెచ్చిన రైటర్ చిత్రం

పిక్ టాక్ : అందాల అరాచకం

- Advertisement -