రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌..

148
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ స్వల్ప అనారోగ్యం కారణంగా గురువారం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యంపై అనేక వార్త‌లు వస్తున్న నేప‌థ్యంలో తాజాగా కావేరి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో నిన్న చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్‌లో వివరించారు.

‘‘అక్టోబర్ 28వ తేదీన తీవ్రమైన తలనొప్పితో రజనీకాంత్‌గారు చెన్నై అల్వార్ పేటలో ఉన్న కావేరీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. నిపుణులైన డాక్టర్లు ఆయనను పరీక్ష చేసిన అనంతరం బ్రెయిన్‌కి రక్తాన్ని సరఫరా చేసే ఓ రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్లుగా గుర్తించి దానికి సంబంధించి సర్జరీ చేయాలి అని సూచించడం జరిగింది. ఆ సర్జరీకి సంబంధించిన ప్రాసెస్ ఈరోజు(శుక్రవారం) విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఇబ్బందీ లేదు. చక్కగా కోలుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయబడతారు..’’ అని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌‌లో‌ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ పేర్కొన్నారు.

కాగా ఇటీవలే దేశంలోనే అత్యుత్తమ చలనచిత్ర అవార్డు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ఆయన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.

- Advertisement -