ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్..

38
rajini

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అదే సమయంలో బీపీని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఒత్తిడికి గురికాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని రజనీకి వైద్యులు సూచించారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ సోకె అవకాశం ఉన్న ఎలాంటి కార్యకమాల్లో పాల్గొనవదని వైద్యులు సూచించారు.

గతంలో కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ చేపించుకున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు. చెన్నైలోని తన నివాసంలోనే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు సూపర్ స్టార్. రజనీ కోలుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.