ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండం మెయిన్ హైలైట్. రీసెంట్‌గా ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటిస్తోన్న తలైవర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయగా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తన ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు రజినీకాంత్.
తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో లెజెండ్రీ క్రికెటర్, 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారాయన. ‘‘లెజెండ్రీ పర్సన్, మనం అందరం ఎంతో గౌరవించాల్సిన గొప్ప మనిషి కపిల్ దేవ్‌జీతో కలిసి పని చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ వరల్డ్‌కప్‌ను సాధించి మన భారతదేశం గర్వపడేలా చేశారాయన’’ అంటూ కపిల్ దేవ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు రజినీకాంత్. నటనలో లెజెండ్రీ పర్సనాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్రశంసిస్తూ చేసిన సదరు ట్వీట్ హాట్ టాపిక్‌గా మారటమే కాదు.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో వైపు కపిల్ దేవ్ సైతం రజినీకాంత్‌తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘రజినీకాంత్‌గారితో కలిసి పని చేయటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు.
Also Read:BRS: బిఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!
భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
Also Read:హ్యాపీ బర్త్ డే..నవాజుద్దీన్ సిద్ధిఖీ
నటీనటులు:సూపర్‌స్టార్ రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, సమర్పణ: సుభాస్కరన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్: బి.ప్రవీణ్ భాస్కర్,ఆర్ట్: రాము తంగరాజ్, స్టైలిష్ట్: సత్య ఎన్.జె, పబ్లిసిటీ డిజైనర్: శివమ్ సి.కబిలన్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).
It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup!!!#lalsalaam#therealkapildev pic.twitter.com/OUvUtQXjoQ
— Rajinikanth (@rajinikanth) May 18, 2023