సూపర్ స్టార్ రజనీకాంత్ పా రంజిత్ దర్శకత్వంలో ‘కాలా’ చిత్రంలో నటిస్తున్నారు. మంబై నేపథ్యంతో మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ముంబైలో షూటింగ్ పూర్తి చేసుకుంది. తరువాత చైన్నైలో షూటింగ్ జరగునుంది. అయితే ఇప్పుడు రజనీ మరోసారి చెకప్ కి యూస్ వెళ్ళనున్నాడనే వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గత ఏడాది కబాలి, 2.0 చిత్ర షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన రజనీ కొద్దిగా నీరసించారు. వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అమెరికాకు వెళ్తుండడంతో అసలు ఏంజరిగిందని అభిమానులలో ఆందోళన నెలకొంది.
మరోవైపు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఓ వైపు రజకీ కొత్త పార్టీ పెడతారని ఆయన సోదరుడు ఇప్పటికే ప్రకటించినప్పటికీ… రజనీ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వచ్చే ఏడాది రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. రజనీ కూడా అటు తన అభిమానులతో మరోసారి భేటీ అవనున్నట్లు ప్రకటించారు.
అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఇన్‌సైడ్ టాక్. రాజకీయాల్లోకి వస్తే ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారట. రాజకీయాలు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మధనపడుతున్నారట.ఇప్పటికే ఆయన సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పుడు కూడా వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారని తెలుస్తోంది.