సుమతో బ్రేకప్…రీజన్ చెప్పిన రాజీవ్ కనకాల..!

256
suma rajeev

టాలీవుడ్ మెస్ట్ బ్యూటీపుల్ కపుల్‌లో ఒకరు రాజీవ్ కనకాల-సుమ. సుమను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజీవ్‌ కపుల్ అంటే ఇష్టపడని వారుండరు. తన వ్యాక్చాతుర్యం,సమయస్పూర్తితో ఆడియో,ప్రీ రిలీజ్ ఏదైనా సెంటర్ అట్రాన్‌గా సుమ ఉండాల్సిందే. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రాజీవ్ కనకాల. ఇక మహర్షి సినిమాలో కీలక పాత్రలో నటించిన రాజీవ్‌ మూవీ హిట్ కావడంతో వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమతో లవ్,పెళ్లి,సినిమా అవకాశాల గురించి వివరించారు. తాను డైరెక్ట్ చేసిన సీరియల్ కోసం ఎడిట్ సూట్‌కి వెళ్లి అక్కడే సుమని చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు. తర్వాత మాధురి సీరియల్‌లో సింగిల్ ఎపిసోడ్‌లో ఇద్దరం కలిసాం..ఇక మేఘమాలతో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగిందన్నారు. ఈ సీరియల్‌కు నాన్న దర్శకత్వం వహించడంతో తాను చేసింది చిన్న క్యారెక్టరే అయినా సుమ కోసమే షూటింగ్‌కు వెళ్లేవాడినని తెలిపాడు.

తర్వాత అందరి లవ్ స్టోరీలాగే ఏదో ఒకటి చెప్పి ప్రపోజ్ చేశా..తను నో అంటుందని తెలుసు అయినా సుమనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అయి ప్రపోజ్ చేశానని చెప్పారు. మూడు రోజుల్లో సుమ ఆక్సెప్ట్ చేసింది. అయితే ఇద్దరం ఓకే అనుకున్న తరువాత మా లవ్‌కి ఏడాదిన్నర బ్రేక్ పడింది.

తాను ఏదో అన్నానని పెళ్లికి ముందే ఆంక్షలు పెడుతున్నాడని ఎలాంటి సమస్యలు వస్తాయో అని లవ్ స్టార్ట్ అయిన ఆరునెలల తరువాత బ్రేకప్ అంది. కన్వెన్స్ చేయడానికి ఎంత ట్రైచేసిన ప్రయత్నం లేకపోయింది. ఆతర్వాత వరుస సీరియల్,సినిమాలతో బిజీ అయ్యా అనుకోకుండా 1998లో మళ్లీ మా ప్రేమకథ పట్టాలెక్కింది. అనంతరం ఒక నెలలోనే పెళ్లి అయిపోయిందని వెల్లడించారు.