గోదావరిపై కొత్తప్రాజెక్టులు నిర్మించడం లేదు:రజత్ కుమార్

258
rajath kumar
- Advertisement -

గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదని తెలిపారు ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని చెప్పారు.

బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 967.14 టీఎంసీల వాటా తెలంగాణకు ఉందని ఆ పరిధిలోనే నీటిని వినియోగించుకుంటున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్ల కోసం ….కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టు నుంచి అదనంగా నీరు తీసుకుంటున్నారని ఏపీ ఫిర్యాదు చేసిందన్నారు.

తెలంగాణ లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదని..పట్టిసీమ నుంచి తీసుకుంటున్న మేరకు 80 టీఎంసీ లలో 45 టీఎంసీలు షేరింగ్ కావాలని అడిగాం అన్నారు.జూన్ 2 2014 వరకు పూర్తైన ప్రాజెక్టు ల వాటి డీపీఆర్ లు అడగొద్దని….గోదావరి లో ఎక్కడెక్కడ టెలిమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనేదిపై హైడ్రాలిక్ కమిటీ నియామకం. ఎక్కడెక్కడ .. ఎన్ని ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ఇస్తారన్నారు.

కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పాత ప్రాజెక్ట్ గానే పరిగణిస్తూ లెటర్ ఇచ్చిందని…225 టీఎంసీలు లకు డిజైన్ చేసి 400 టీఎంసీలు తీసుకువెళ్తాము అని చెప్పడం సమంజసం కాదన్నారు. ఎస్సార్ ఎస్పీ,నిజాం సాగర్ 180 టీఎంసీల సామర్ధ్యం ఉంది కాని పై రాష్ట్రాలు వాడుకోవడం వలన తెలంగాణకు నీళ్లు రావడం లేదన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిపిఆర్ లు అడగడం విచిత్రంగా ఉందని…గతంలో ప్రాజెక్ట్ ల డిపిఆర్ ల లొకేషన్,డిజైన్ లు మారాయి.బచవత్ ట్రిబ్యునల్ ప్రకారం మా రాష్ట్ర పరిధిలో మా వాటా ప్రకారమే వాడుకోవచ్చన్నారు.

- Advertisement -