రోజుకు 6వేల మందికే టీటీడీ దర్శనం..

240
subbareddy
- Advertisement -

రోజుకు ఆరు వేల మందినే టీడీడీ దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ నెల 11 నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి రోజూ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న 3 వేలమందికి, నేరుగా వచ్చే మరో 3 వేలమందికి శ్రీవారి దర్శనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఈ నెల 11 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కేవలం ఒక గంట మాత్రమే అని వెల్లడించారు. ఆపై ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకు సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.

కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడినవారికి, పిల్లలకు దర్శనాలు ఉండవని అన్నారు. ఈ నెల 8న ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కానుందని, జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. వసతి గదుల్లో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని, ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

అలిపిరి నుంచి మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతి ఉంటుందని, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కనుమ దారుల్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -