ఏపీ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు తీవ్ర నష్టం- రజత్ కుమార్

308
Rajat Kumar IAS On AP 203 GO
- Advertisement -

శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది అని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. అయితే దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఏపీ ఉత్తర్వులపై ఉన్న అభ్యంతరాలు వివరించారు రజత్ కుమార్.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పాం. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేపట్టరాదని చెప్పామన్నారు.తదుపరి ముందుకెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాం. దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ చెప్పారు అని రజత్ కుమార్ తెలిపారు.

512 టీఎంసీల్లోనుంచే తీసుకుంటామని ఏపీ చెప్తున్నా ఎలాంటి పర్యవేక్షణ లేదు. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్‌లో ఇప్పటికే పోరాడుతున్నామని..మిగులు జలాలకు సంబంధించి పూర్తి లెక్కలు తేల్చాల్సిందే అన్నారు ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్.

- Advertisement -