సన్ రైజర్స్ ను చిత్తు చేసిన రాజస్ధాన్

269
RR
- Advertisement -

ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్ధాన్ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్ధాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20ఓవర్లలో 160పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 32బంతుల్లో 37పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ విలియమ్ సన్స్ 14బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆతర్వాత వచ్చిన యువ ఆటగాడు మనిష్ పాండే విజృంభించి ఆడాడు.

36బంతుల్లో 61పరుగులు చేసి జట్టు పరువు నిలబెట్టాడు. రషిద్ ఖాన్ 8బంతుల్లో 17పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా..మిగతా వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 161పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ ఇంకా 5బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రాజస్ధాన్ ఓపెనర్ బ్యాట్స్ మెన్లు అజింకా రహానే, లివింగ్ స్టోన్ లు ఇద్దరూ సన్ రైజర్స్ కి చుక్కలు చూపించారు. తొలి 75 పరుగుల వరకూ వికెట్ నష్టపోకుండా ఆడారు.

రహానే 34బంతుల్లో 39పరుగులు చేసి అవుట్ కాగా, లివింగ్ స్టోన్ 26బంతుల్లో 44పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజయ్ సామ్ సన్ 32బంతుల్లో 48పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టివెన్ స్మిత్ 16బంతుల్లో 22పరుగులు చేసి రాజస్ధాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్ధాన్ విజయం సాధించి ఉపిరి పిల్చుకుంది.

- Advertisement -