మెగా హీరో మూవీలో విజయ్ సేతుపతి

167
Vijay-Sethupathi-In-Panja-Vaishnav-Tej-Movie

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈసినిమాకు దర్శకత్వం వహించగా సుకుమార్ రైటింగ్స్,, మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీ పూజా కార్యక్రమాలు చాలా గ్రాండ్ గా చేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే ఈమూవీలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడని తెలుస్తుంది. త‌మిళంలో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు విజ‌య్ సేతుప‌తి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఇటీవ‌ల 96, సూప‌ర్ డీల‌క్స్ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేసిన విజ‌య్ సేతుప‌తి లాభం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు తెలుగులో సైరా చిత్రం చేస్తున్నాడు. సైరా నరసింహరెడ్డి తర్వాత విజయ్ సేతుపతి నటిస్తున్న రెండవ మూవీ విశేషంగా చెప్పుకోవచ్చు..