నేడు మహర్షి నుంచి ‘పాల పిట్ట’సాంగ్

162
Maharshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈమూవీ మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మే1వ తేదిన హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ పాటలకు శ్రోతల నుండి అద్భుతైమెన స్పందన వచ్చింది.

ఇక సినిమాలోని ఐదో పాట అయిన ‘పాలపిట్ట..’ను ఏప్రిల్ 29 ఉదయం 9.09 గంటలకు విడుదల చేయబోతున్నారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొనే ఫోక్ సాంగ్ గా ఈ పాట రూపొందింది. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్ తో ఈమూవీ తెరకెక్కుతుంది.