2.0 చూసిన రజనీ..

361
rajanikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 2.0. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రికార్డు వసూళ్లను రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

భారత్‌లోనే కాదు విదేశాల‌లోను ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విజువ‌ల్ వండ‌ర్‌లా శంక‌ర్ ఈ చిత్రాన్నితెర‌కెక్కించ‌గా,
ప‌క్షిరాజా పాత్ర‌లో అక్ష‌య్ కుమార్‌, వెన్నెల అనే రోబో పాత్ర‌లో అమీ జాక్స‌న్‌లు న‌టించి మెప్పించారు.

ఈ చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ త‌న ఫ్యామిలీతో క‌లిసి థియేట‌ర్‌లో వీక్షించారు. ర‌జ‌నీ మ‌న‌వడు, మ‌న‌వ‌రాలు యాత్ర ధ‌నుష్, లింగా ధ‌నుష్‌లు త‌మ తాత‌తో క‌లిసి ఈ చిత్రాన్ని వీక్షించి ఫుల్ హ్య‌పీగా ఫీల‌య్యార‌ట‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే .

- Advertisement -