మహానటి నా జీవితాన్నే మార్చేసింది..

250
keerthi suresh
- Advertisement -

కీర్తి సురేష్‌…తెలుగు,తమిళ భాషల్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. వరుస సక్సెస్‌లను సాధిస్తు అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో హీరోయిన్‌గా కీర్తిని తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సీతగా ఈ సినిమాలో కీర్తి అలరించనుందట.

తాజాగా మరో మూవీకి కమిట్ అయింది కీర్తి సురేష్‌. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

 మహానటి చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని ఎప్పటికీ మీరు(సావిత్రి) లెజెండ్‌గానే కీర్తింపబడతారని. మీ ప్రేమ, దీవెనలు మాకు ఈ సినిమా(మహానటి) చేసే శక్తినిచ్చాయని తెలిపింది. మా శక్తి మేరకు శ్రమించాం కానీ మీరు ఎప్పటికీ వెలకట్టలేని వ్యక్తే. మీరు  నా జీవితాన్ని మార్చేశారని సావిత్రమ్మ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసింది.

- Advertisement -