ఆ పోస్టర్‌ పై వచ్చిన రూమర్లకు జక్కన్న చెక్‌..!

189
Rajamouli clarified about anushka's looks
- Advertisement -

‘బాహుబలి’ ది బిగినింగ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా  ఏప్రిల్ లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా..’బాహుబలి-2′ లో మాత్రం ప్రేక్షకులకి తెగ అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలకు కారణం అందాలతార  అనుష్క .  ఎందుకంటే ఈ అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ స్వీటి అందాలను ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ లో చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు.  కానీ.. బాహుబలి2లో  అనుష్క గ్లామర్ గా కనబడుతుందని ఫ్యాన్స్‌ అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత అనుష్క ‘జీరోసైజ్‌’  సినిమా ఒప్పుకుంది. ఇక ఆ సినిమా కోసం ఈ అమ్మడు పడ్డ కష్టం అంతాఇంతా కాదు.
ఈ సినిమా కోసం అనుష్క లావు పెరిగింది. కానీ ఇప్పుడు ఆ భారీ దేహమే..అనుష్కకి  మైనస్‌ పాయింట్‌గా మారింది.
 Rajamouli clarified about anushka's looks
బాహుబలి-2 సినిమాలో అనుష్క పాత్ర కీలకంగా ఉండబోతోందని, అంతేకాకుండా ఇందులో అనుష్క గ్లామరస్‌గా కూడా కపించనుందని వార్తలొచ్చాయి.  అయితే ఇక్కడే అభిమానులకు అనుష్క మీద అనుమానాలు మొదలయ్యాయి. జీరోసైజ్‌ కోసం లావు పెరిగిన అనుష్కకి బాహుబలి-2సినిమా లో గ్లామర్‌ గా కనబడాలంటే..లావు తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ అనుష్క ఇప్పటివరకు కూడా లావుగానే కనిపిస్తుంది. అందుకే బాహుబలి-2 సినిమాలో కూడా అనుష్క లావుగానే కనబడుతుందని అంతా అనుకుంటున్నారు.

కానీ ఇటీవలే బాహుబలి-2 లో అనుష్క కు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశాడు రాజమౌళి. ఆ పోస్టర్ లొ అనుష్క సన్నగా కనబడటంతో అందరూ షాక్‌ అయ్యారు. అంతేకాకుండా  ఇందులో అనుష్కను గ్రాఫిక్స్‌ ద్వార సన్నగా చూపించే ప్రయత్నం చేశారు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఆ అనుమాలన్నింటికీ  జక్కన్న చెక్‌ పెట్టేశాడు. అనుష్క షూటింగ్‌ పార్ట్‌ మొత్తం ముందే పూర్తైందని చెప్పేశాడు రాజమౌళి.  అయితే.. తాజాగా  పార్ట్‌-2 కి కావాల్సిన కొన్ని సీన్స్‌ ని మాత్రమే అనుష్కతో చేసినట్లు చెప్పుకొచ్చాడు.  అంతేకాకుండా అనుష్క  మొదటి పార్ట్‌ లో కనిపించినట్లుగానే, ఇందులో కూడా సన్నగానే కనిపిస్తుందని,  చాలా గ్లామర్‌ గా కూడా కనిపిస్తుందని జక్కన్న తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.

- Advertisement -